by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:23 PM
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని గురువారం తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.