by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:04 PM
తీసుకున్న రుణం తాలుక డబ్బులు కట్టలేదని బ్యాంకు అధికారులు వేదింపులు చేసినందుకు మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిర్పూర్ ఎస్ ఐ. సిర్పూర్(టి) మండలం శివపూర్ గ్రామానికి చెందిన కారం సంతోష్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు.
జిల్లా కొ-ఆపరేటిట్ బ్యాంక్ (సిర్పూర్ (టి) శాఖ) వారు లోన్ డబ్బుల కట్టలేదని మంగళవారం రోజున బెదిరింపులకు గురిచేసారని మనస్తాపం చెంది పురుగుల మందుతాగి సంతోష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చింది. బ్యాంకు మేనేజర్ తో పాటు సిబ్బంది పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాము.