by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:16 PM
నడికూడ మండలం ముస్త్యాల పల్లి గ్రామంలో ఊర్సు షరీఫ్ హజ్రత్ సయ్యద్ మదార్ షావలి రైమతుల్లా అలైహి దర్గా షరీఫ్ ఉత్సవాల్లో పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం దర్గా నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అంతక ముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ...దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని,వసతి గృహాల షెడ్డు ఏర్పాటుకు చేయాటకు సహకరిస్తానని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతసామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందేలా చూస్తుందని అన్నారు. పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.