by Suryaa Desk | Wed, Jan 08, 2025, 08:04 PM
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) తెలంగాణ రాష్ట్రానికి బీర్ల సరఫరాను నిలిపివేసింది. దాంతో ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోయింది. ఐదేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, దీంతో నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.యూబీఎల్ ప్రతినిధులు ఈరోజు తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్‌ను కలిశారు. తెలంగాణకు అన్ని రకాల బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నామని పేర్కొంటూ లేఖ అందించారు. ధరలు పెంచాలని పలుమార్లు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, దీంతో తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.