by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:05 PM
ఉత్తమ విద్య కొరకు విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకయ్య విద్యార్థులను కోరారు. బుధవారం కళాశాల కరపత్రంను కళాశాలలో అధ్యాపకులు సమక్షంలో ఆవిష్కరణ చేశారు. అనంతరం కళాశాల సిబ్బంది ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులను కలిసి కరపత్రాలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంజీవ్ మాట్లాడుతూ అనుభవం, అంకిత బావం గల అధ్యాపకులు, బోధన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఉందని పేర్కొన్నారు.
మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు ఉన్న ఏకైక కళాశాలలో చేరాలసిందిగా విద్యార్థులను పిలుపునిచ్చారు.అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సరస్వతి మాతా విగ్రహ కొరకు రెండు వేల రూపాయల విరాళం అందించిన ప్రిన్సిపాల్ సంజీవ్ ను అధ్యాపకులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తుంటి దేవన్న, అధ్యాపకులు మనోజ్ కుమార్, గట్టయ్య, శ్రీకాంత్, సత్తయ్యలు పాల్గొన్నారు.