by Suryaa Desk | Thu, Jan 09, 2025, 01:58 PM
రంగనాయకుల గుట్టపై కొలువై ఉన్న స్వయంభు కరిగిరి శ్రీ లక్ష్మీరంగనాథ స్వామి వారి దేవస్థానంలో ది.10-01-2025 శుక్రవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకము . ఉదయం 4-30 గం.లకు ఆండాళ్ అమ్మవారి పల్లకి సేవ , ఉ. 5-30 గం.లకు ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుందని అన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం శ్రీ రంగనాథ స్వామి వారి గ్రామోత్సవం (ఊరేగింపు) , 11-01-2025 శనివారం ద్వాదశి కుడారోత్సవం సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి వారికి 108 గిన్నెలతో పాయసం నివేదన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం , ది.13-01-2025 సోమవారం గోదా శ్రీ రంగనాథ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వైకుంఠద్వారంలో శ్రీరంగనాథ స్వామి వారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శన పుణ్యఫలాన్ని పొందాలని చైర్మన్ జూలకంటి సతీష్ కుమార్ , ప్రధాన అర్చకులు బూరుగడ్డ శ్రీధరాచార్యులు , వెంకట కృష్ణమాచార్యులు ఆచార్య సాందీప్ లు కోరారు .