by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:58 PM
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో పెండింగ్ లో ఉన్న కెనాల్ ను పరిశీలించి భూ యజమాని భీమయ్య గారి లింగంతో మాట్లాడి కాలువ నిర్మాణం కోసం సహకరించాలని కోరారు. అలాగే సూరంపల్లి, ముబారస్ పూర్, గాజులపల్లి గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నిధులు సిద్దిపేటకు తరలించకపోయారని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజ వర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసి సీఎం రైతులను రుణ విముక్తులను చేశారని, త్వరలోనే రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు కరణాల శ్రీనివాస్ రావు, కనకయ్య, స్వామి, మల్లారెడ్డి, ఆది వేణుగోపాల్, సంపత్ రెడ్డి, నర్సింలు, సాయిలు, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.