by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:01 PM
సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతిలో ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు అందోలు గురుకుల పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ లింగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనల విడుదల చేశారు. డిసెంబర్ 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఫిబ్రవరి 1వ తేది వరకు ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కులం, ఆదాయం, ఆధార్ కార్డు నంబర్, బర్త్ సర్టిఫికెట్, ఫోటోను ధరఖాస్తుతో జతచేయాలన్నారు. ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షల్లో తెలుగు 20 మార్కులు, ఇంగ్లీష్ 25, గణితం 25, పరిసరాల విజ్ఞానం 20 , మెంటల్ ఎబిలిటీ 10, మొత్తం వంద మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుందన్నారు. అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.