by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:14 PM
డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటే టిఆర్ఎస్ నేతల మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు గోసపడుతున్నారని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మాడల్ ఇందిరమ్మ భవనాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇయ్యని దౌర్భాగ్యులు బి ఆర్ ఎస్ నేతలు అన్నారు. సొంత ప్రయోజనాల కోసం పాకులాడిన తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఎమ్మెల్యే విమర్శించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రకారం రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నా కూడా ఆర్ గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు.
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ గృహాలు అందించి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా అందజేస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని వాటిని నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మార్వో ఎంపీడీవో నోడల్ ఆఫీసర్ మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరు పాల్గొన్నారు