by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:03 PM
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో గతంలో రెండు, మూడు సార్లు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం, ఈ విషయం విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించడంతో వైస్ ప్రిన్సిపల్ ఈ తంతాంగం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే ఆసరాగా తీసుకొని ఇటీవల మరోసారి విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయుల పనితీరు పై, తల్లిదండ్రులకు వివరించ గా చివరకు విద్యార్థినుల లైంగిక వేధింపుల కేసుపోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో నలుగురు ఉపాధ్యాయులపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ పోలీసులు వెల్లడిస్తున్నారు.
ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగింది. పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు తెలుపకపోవడం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఎవరు తప్పు చేసినా కచ్చితంగా చట్టం తప్పు చేసిన వ్యక్తుల పేర్లను మీడియాకు వెల్లడించవలసి ఉండగా, అది మా పరిధిలో లేదు అంటూ నిజం సాగర్ ఎస్సై శివ కుమార్ తెలిపారు.సమానమే, ఎవరు తప్పు చేసిన కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే,కానీ పోలీస్ మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఉపాధ్యాయుల వివరాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులను, అధ్యాపకులను అరెస్టు చేసిన ఘటనలు వెలుగు చూసాం. కానీ నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో మూడుసార్లు విద్యార్థుల పట్ల అసభ్యంగా ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు వైస్ ప్రిన్సిపాల్ కు దృష్టికి విద్యార్థినిలు తీసుకుపోయినప్పటికీ, దానిని బయటకు పక్కనివ్వకుండా వైస్ ప్రిన్సిపల్ జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో వైస్ ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాలు నుంచి డిమాండ్ చేశారు.