by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:18 PM
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో శ్రీనివాస్ ద్వారా ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. కోర్టు కేసు ఫైళ్లను, ధరణి దరఖాస్తులను, రికార్డుల నిర్వహణ, ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గమ్మలక్ష్మిపురంలోని ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈకళాశాలలోనే నేను చదువుకొని ఈస్థాయికి వచ్చానని విద్యార్థులకు గుర్తు చేశారు.