by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:24 PM
మండల పరిధిలోని లింగరాజు పల్లి మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలలో నీటి ఎద్దడి రాకుండా మిషన్ భగీరథ ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఏఈ తో కలిసి హాస్టల్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రిన్సిపల్ పాఠశాలలో నీటి సమస్య ఉందని శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆయన వెంటనే స్పందించి మిషన్ భగీరథ ద్వారా నీరు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు