by Suryaa Desk | Mon, Jan 06, 2025, 04:01 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామస్తుడైన మారుపాక లింగ బాబు అనే యువకుడు నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలు అవ్వడంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయి హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి వైద్యులు చాలా వరకు డబ్బు ఖర్చవుతుందని చెప్పడంతో తనతోపాటు చదువుకున్నటువంటి 2007-2008 బ్యాచ్ వాళ్ళందరూ కలిసి 75 వేల రూపాయలు జమ చేయడం జరిగింది.
ప్రమాదంలో ఉన్న తోటి స్నేహితునికి సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.అలాగే గొల్లపల్లిలోని రెడ్డి సంఘం వారు 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఇంకా ఎవరైనా మీకు తోచిన సహాయం చేయాలనుకుంటే 8142630027 నెంబర్ కి గూగుల్ పే,ఫోన్ పే గాని చేయగలరు.