by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:38 PM
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయముకి కళాశాల ముందున్న ప్రైవేట్ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఘాతానికి గురై జయముఖి కళాశాలకు చెందిన ఫార్మ్ డి చదువుతున్న నిర్మల్ జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థి కొండేల్వాడి అవినాష్ రెడ్డి మృతి చెందడంతో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని హాస్టల్ నిర్వాహకులకు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట మార్చురీ ముందు నిరసన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లడుతూ.. యజమాన్యం నిర్లక్ష్యం వల్ల మరణించిన అవినాష్ రెడ్డి కుటుంబానికి సత్వరమే న్యాయం చేయాలని, ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్న వార్డెన్ వివేక్ ను అరెస్టు చేసి హాస్టల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రాకం రాకేష్,కార్యకర్తలు శశి,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.