by Suryaa Desk | Tue, Jan 07, 2025, 03:45 PM
ఫార్ములా ఈ-రేసు కేసు లో తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని మంత్రి జూపల్లి కృష్ణరావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.ఇవాళ ఆయన బాన్సువాడ లో మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేయకపోతే కేసును కేటీఆర్ ఎదుర్కోవాల్సిందేనని కామెంట్ చేశారు. హైకోర్టు లో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసిందని.. ఇప్పటికైనా ఏసీబీ , ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాలని హితవు పలికారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీఇప్పటికే కనుమరుగైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కూడా లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం.. కేటీఆర్, కవిత సీఎంలు అవ్వడం కలగానే మిగిలిపోతుందని కామెంట్ చేశారు. రుణమాఫీ కింద రైతులు ఖాతాల్లో రూ.21 వేల కోట్లను జమ చేశామని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ప్రతి నెల రూ.6,500 కోట్ల వడ్డీ కడుతోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం కలిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని జూపల్లి అన్నారు.