by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:24 PM
మేడిపల్లి మండల కేంద్రంలోని పిఎన్ఆర్ గార్డెన్ లో మేడిపల్లి మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మాదం వినోద్ యాదవ్, ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి రాజారెడ్డి. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గా బలగం రాజేష్, అయిత మోహన్, పల్లి భీమయ్య, దాసరి గణేష్, మాలోతు హనుమంతు, మోబిన్ పాషా, మామిడి రమ, ఏలేటి మహేష్, సురకంటి రాజారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అందరూ సమానులే, పదవులు ఉన్నోళ్లు గొప్పని కాదు, పదవులు లేనివారు గొప్పకాదు అని కాదు, ఒక పదవి ఒక్కరికే ఉంటుందని ఆ పదవి కోసం వందమంది పోటిపడవచ్చు అడగవచ్చు ఇబ్బంది లేదు.
పదవులు ఒకసారి రావచ్చు రాకపోవచ్చు ప్రజా ప్రభుత్వంలో మీరందరూ మనమందరం సమానులే అందరూ కావలసినవారే పదవులు లేని వారు బాధపడల్చిన అవసరం లేదని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఉమ్మడి మేడిపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తానని, ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నాం, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన, రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.