by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:28 PM
పెంచికల్ పేట్ మండలకేంద్రంలో డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటించాలని ఎస్సై కొమురయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత మహోత్సవం ఉత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆయన అన్నారు.
ప్రధాన చౌరస్తాలో వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆయన అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన, తాగి వాహనం నడిపిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన అన్నారు.వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలు, లైసెన్స్లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..