by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:44 PM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా ఏబీవీపీ వరంగల్ జిల్లా గజ్జల దేవేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ లో పని చేస్తున్న ఉద్యోగులు గత 25 రోజులుగా సమ్మేచేస్తున్నారు, ఈ క్రమంలో విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక KGBV లలో విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో దానికి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందనీ మండి పడ్డారు, MEO ,DEO ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దయచేసి విద్యార్థులపై దయ ఉంచి బోర్డ్ ఎగ్జామ్స్ కు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయనీ , రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ దగ్గరకు వస్తున్నాయనీ కాని ఇప్పటివరకు సెలబస్ పూర్తికాలేదనీ అన్నారు, ప్రాక్టికల్స్ కూడా పూర్తిచేయకపోవడంతో వచ్చే పరీక్షలలో విద్యార్థులు ఎలా పరీక్షలు రాయాలో ఆందోళన చెందుతున్నారనీ మాట్లాడారు.వెంటనే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలనీకోరారు.
రాష్ట్రంలో 400కు పైగా కస్తూరిబా హాస్టల్స్ ఉంటే అందులో లక్ష ఇరవై వేలకు పైగా పేద బలుగు బలహీన వర్గాల విద్యార్థినిలు చదువుతున్నారు. గురుకుల సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయనీ, కనీసం హాస్టల్లో స్కావెంజర్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇకనైనా ప్రభుత్వం విద్యార్థులపై దయ చూపి వెంటనే విద్యార్థుల సమస్యలను పట్టించుకోని పరిష్కరించాలి ,ఇప్పటివరకు గురుకుల సంక్షేమ హాస్టలలో పిట్టలు రాలినట్టు 52 మంది విద్యార్థులు చనిపోతే ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం దీనిపై మాట్లాడలేదు ఈ చావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి నైతిక బాధ్యత వహించాలనీ, అలాగే వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేదంటే రాబోవు రోజులలో ఏబీవీపీ ఉద్యమాలు తీవ్రతం చేస్తామని హెచ్చరించారు, ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలుకొని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని అన్నారు.