by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:06 PM
వికారాబాద్ (D) లగచర్ల కేసులో కీలక నిందితుడు సురేశ్( ఏ1)కు గురువారం HYD-నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తు, షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సురేశ్‌ను ఆదేశించింది. అయితే ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకొని సురేశ్‌ను పోలీసులు విచారించారు. కాగా, ఫార్మాసిటీ ఏర్పాటు కోసం కొద్ది రోజుల క్రితం లగచర్ల చేరుకున్న కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.