by Suryaa Desk | Wed, Jan 08, 2025, 09:04 PM
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు ఏసీబీ జారీ చేసిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదన్నారు. విచారణ కోసం నోటీసులు ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో పేర్కొంటారని, కానీ కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో అవి లేవన్నారు. కేటీఆర్‌కు ఇచ్చినవి నోటీసుల్లా కాకుండా లేఖల్లా ఉన్నాయన్నారు.కేటీఆర్‌కు ఏసీబీ 160 సీఆర్పీసీ (ప్రస్తుతం 179 బీఎన్ఎస్) కింద నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్‌లో కేటీఆర్ నిందితుడు మాత్రమేనని... కాబట్టి నిందితుడికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వరాదన్నారు. ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలంటే బీఎన్ఎస్ 94 (గతంలో 91 సీఆర్పీసీ) కింద నోటీసు ఇవ్వాలని కానీ అలా ఇవ్వలేదన్నారు.