by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:24 PM
ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు సంఘ సభ్యులుగా కొనసాగుతూ మృతి చెందిన రైతులు గామాసు నారాయణమ్మ, మందడపు వీరబాబు కుటుంబాలకు సొసైటీ అందిస్తున్న బీమాను వెంటనే అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు గురువారం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీబీ బ్యాంకు నందు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు.