by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:43 PM
వికారాబాద్ లో రూ.7.50 లక్షల విలువ చేసే 30 కేజీల గంజాయి పట్టివేత. తాండూర్ రైల్వే స్టేషన్ లో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు నిందితుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కోణార్క్ ఎక్స్ప్రెస్ లో గంజాయిని తీసుకువస్తూ తాండూర్ లో దిగి ఎక్సైజ్ పోలీసులకు గురువారం శిబిరామ్ స్వాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వద్ద 30 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కోణార్క్ ఎక్స్ప్రెస్ నుంచి దిగి గంజాయిని మరొక వ్యక్తికి ఇవ్వడానికి ఎదురు చూస్తున్న సమయంలో రైల్వే పోలీసులు కలిసి నిందితున్ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 7.50 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బిబి కమలహాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ అభినందించారు.