by Suryaa Desk | Thu, Jan 09, 2025, 04:28 PM
జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్‌లో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్లు దేవదాయ శాఖ అధికారులు గుర్తించారు. పలు సార్లు నోటీసులు జారీ చేసినా ఎవరు స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు జేసీబీలతో అక్రమంగా వెలసిన షెడ్డులను తొలగిస్తున్నారు. .నోటీసులకు స్పందించకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో ఆ స్థలంలో వెలసిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ భూములకు సంబంధించి కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా ఎలా కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో స్థానికులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది