by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:16 PM
దాతల సహకారంతో పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని అనాజీపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం రోటరీ క్లబ్ సికింద్రాబాద్, శ్రీ విక్రమ్ మెహెతా, సాయికుమార్, సత్యసాయి సేవాసమితి బేగంపేట్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు 25 డెస్కులు విద్యార్థులకు అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థులు. గ్రామస్తులు యువకులు సహాయ సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు. అనాజీపూర్ పాఠశాలకు రోటరీ క్లబ్ ద్వారా డెస్కులను అందించడంలో కీలక పాత్ర పోషించిన తులసిదాస్ ను అభినందించారు. ఈకార్యక్రమంలో రాయపోల్, అనాజీపూర్ప్రధానోపాధ్యాయులు మేరీ నిర్మల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు....