by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:04 PM
నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో నేడు జరనుగంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య వేడుక జరగనున్న నేపథ్యంలో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
ట్రాఫిక్ ఆంక్షలు…
- జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణానగర్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలను శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మీదుగా మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్లే వాహనాలను కృష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా బోరబండ బస్టాప్ వైపు అనుమతించనున్నారు.
- అదే విధంగా బోరబండ నుంచి మైత్రివనం జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా మళ్లించనున్నారు.
- ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారు తమ వాహనాలను జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్, మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.