by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:26 PM
శ్రీమహావిష్ణువు కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంజయ్య యాదవ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులతో కలిసి జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లిన ఆయన వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.