by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:38 PM
దేవరకొండ నియోజకవర్గం నేరేడుగొమ్ము మండలం లో గురువారం ఎంపీ రఘువీర్ రెడ్డి,తో ఎమ్మెల్యే బాలు నాయక్ కలిసి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, రోడ్డు పనులు విస్తరణ కోసం శంకుస్థాపన చేశారు.అనంతరంఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలనునిర్మిస్తామన్నారు.కార్పొరేట్ ఆసుపత్రులకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నానమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధే లక్ష్యంగాదూసుకుపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు.
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు.ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, పిఏసియస్ చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజి ఎంపీపీ జాని యాదవ్,సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి,పాప నాయక్, సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.