by Suryaa Desk | Fri, Jan 10, 2025, 11:27 AM
ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దఎత్తున వస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం, ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొంది.