by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:18 PM
ఎల్ఎండీ కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు సకల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కోర్కెలు తీర్చే స్వామివారి దర్శనం ఉదయం 4గంటల నుంచి ఉంటుందనీ, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్త ద్వార పూజతో పాటు పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సమావేశంలో తిమ్మాపూర్ అధ్యక్షుడు పోలు కిషన్, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, వేంకటేశ్వర రావు, రామచంద్ర రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కిరణ్, గంగారపు రమేష్, ధన లక్మీ, కరుణ, కరుణాకర్, వెంకట్ రెడ్డి, పుప్పాల అశోక్ రెడ్డి, బుర్ర రాజయ్య తదితరులు పాల్గొన్నారు.