by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:49 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని అయ్యప్ప దీక్ష స్వాములు 41 రోజుల శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ఆచరించి తదనంతరం ఇరుముడి కట్టుకొని గురువారం శబరిమలై యాత్రకు బయలుదేరారు.
బొమ్మెన కుమార్ నరేందర్,ముక్తామని గురు స్వాములు చిల్వాకోడూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు స్వాములు గంధ వేణు,గంధం పరంధాములు,అల్లాడి వెంకన్న ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని పూజలు చేసి,పేటతుల్లి ఆడి అనంతరం వాహనంలో శబరిమలై యాత్రకు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు తొట్ల లక్ష్మీరాజం,గర్వందుల గంగన్న,తాండ్ర శంకర్,పరిమి మహేందర్,వేణు,సాయి, సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.