by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:46 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి.
అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గా నరేందర్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీనివాస్ చారీ, బుచ్చి రెడ్డి, రవీందర్, రాజు, వేణు గౌడ్ లు నియమితులయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మ రెడ్డి, క్రిష్ణ గౌడ్, రషీద్, మరియు మహిళ కాంగ్రెస్ నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.