by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:43 PM
బైలాజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రతిభ పోటీలో గొల్లపల్లి మండలం మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న ఎనగందుల వర్షిని రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు.నిన్న సాయంత్రం కలెక్టరేటో జరిగిన కార్యక్రమంలో రెండో ర్యాంకు సాధించిన వర్షిని నీ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు.ఇంకా కష్టపడి చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలను సాధించాలని విద్యార్థినికి కలెక్టర్ సూచించారు.
మోడల్ స్కూల్ కు నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ సుంకరి రవి ప్రత్యేక చొరవ చూపి విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.దీనివల్ల విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందుతూ చదువులో ఆటపాటల్లో జిల్లా రాష్ట్రస్థాయికి వెళుతున్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో రాము నాయక్, ప్రిన్సిపాల్ సుంకరి రవి,వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి,బయాలజీ టీచర్ దయాకర్ రెడ్డి,జిల్లా సెక్టోరల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా బయాలజీ సైన్స్ ఫోరం జిల్లా ప్రెసిడెంట్ రాజగోపాల్,జనరల్ సెక్రటరీ తిరుపతి విద్యార్థినిని అభినందించారు.