by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:29 PM
వికారాబాద్ జిల్లా కేంద్రం లో నీ బ్లాక్ గ్రౌండ్ నిర్వహించిన కబడ్డీ పోటీలు చిన్నతనం నుంచే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు.గురువారం ఆమెచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AKFI)వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో నిర్వహించిన బాల బాలికల సబ్ జూనియర్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్ ను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి గారితో కలిసి చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ పరశురాం నాయక్ మాట్లాడుతూ.. టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన టీమ్ కు రూ.10,000 బహుమతి, రన్నర్ గా గెలిచిన టీమ్ కు రూ.5,000 బహుమతి అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే వీరిలో అబ్బాయిల నుంచి 12 మందిని, అమ్మాయిల నుంచి 12 మందిని సెలెక్ట్ చేసి స్టేట్ స్థాయి కబడ్డీ పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్టేట్ స్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల వికారాబాద్ జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, మాలే లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనంద్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ ముదిరాజ్, బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.