by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:53 PM
బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశం కథనం మేరకు నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన కమ్మరి పండరి మోటార్ సైకిల్ పై నిజాంపేట్ వైపు వెళ్తున్నాడు. పిట్లం నుంచి వస్తున్న హైదరాబాద్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న కమ్మరి పండరికి తీవ్ర గాయాలయ్యాయి.