by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:59 PM
ఆధునిక సాగు పద్దతులతో మంచి ఉత్పత్తి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ఆధ్వర్యంలో 4 డ్రోన్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు మరింత లాభం లబ్ధి చేకూరుతుందని, వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా నాట్లు వేయటం,పురుగుల మందు,గడ్డి మందు స్ప్రే చేయడం, ఎరువుల వినియోగం వంటి వాటికి డ్రోన్ సేవలను వినియోగించవచ్చని అన్నారు.
ఈ సేవలు అవసరమైన రైతులు బంధం పల్లి లోని శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ను సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆది రెడ్డి, విగ్నేశ్వర డ్రోన్ నిర్వాహకులు రమేష్ ,సంపత్, మహేందర్ ,అఖిల్, రాజు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.