by Suryaa Desk | Thu, Jan 09, 2025, 08:19 PM
సంక్రాంతి వేడుకల్లో భాగంగా పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజాను అమ్మిన, ఉపయోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని నర్సాపూర్ ఎస్సై లింగం హెచ్చరించారు. చైనా మాంజా పతంగులతో విద్యుత్ వైర్లకు పడి మనుషులు, పక్షులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గురువారం తెలిపారు. చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పతంగులు ఎగురవేసేందుకు కాటన్ దారాన్ని మాత్రమే వాడాలని సూచించారు.