by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:42 PM
రాష్ట్రంలో పద్మశాలీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చందా మల్లయ్య అన్నారు. గురువారం ఆత్మకూర్ మండల అధ్యక్షులు వెల్ద వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పద్మశాలీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల నుండి సర్పంచులు జడ్పిటిసిలు ఎంపిటిసి లకు పోటీ చేసి గెలుపొంది రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లాస్థాయి నుండి ప్రతి గ్రామంలో ప్రచారానికి సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
పద్మశాలీలు సంఘటితంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చని సూచించారు. అదేవిధంగా ఇప్పటివరకు 50 లక్షల సభ్యత్వ నమోదు జరిగాయని ఇంకా సభ్యత్వ నమోదు కోసం గ్రామాల్లో పద్మశాలి సభ్యులు సభ్యత్వం కోసం అడుగుతున్నారని స్త్రీ,పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇవ్వడానికి రాష్ట్ర పద్మశాలి సంఘం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ ప్రధమ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారని వారి సేవలు ఎనలేని కొనియాడారు.ఈ కార్యక్రమంలో న్యాతని ప్రవీణ్ , శేఖర్ ,పాపని రవీందర్, మార్త కేదారి, పద్మశాలి సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.