by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:19 PM
రానున్న పదవ తరగతి పరీక్షలలో పదికి పది జీపీఏ మార్కులం సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తానని మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్ ప్రకటించారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కస్తూర్బాగాందీ విద్యాలయంలోని విద్యార్థులకు ఆర్డీవో చంద్రకళ, తహశీల్దార్ కృష్ణయ్యల చేతుల మీదుగా 230 మంది విద్యార్థినిలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఇష్టంగా, కష్టపడి చదివుతూ గొప్ప లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. పదిలో 100 శాతం ఫలితాలు సాధించాలని, ఈ మేరకు టీచర్లు కృషి చేయాలని కోరారు. పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు తనవంతుగా రూ.1000 ఇస్తామని హామీ ఇచ్చారు. తహశీల్దార్ కృష్ణయ్య సైతం పదికి పది సాధించిన విద్యార్థులకు రూ.1000 ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.