by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:28 PM
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బీఆర్‌ఎస్ నేతలపై పెడుతున్న తప్పుడు కేసులను ప్రజలకు తెలిసేలా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి మాజీ ఉప సర్పంచ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పొన్నం అనిల్‌గౌడ్ రూపొందించిన 2025 క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం పొన్నం అనిల్‌తో పాటు ఆయన వెంట ఉన్న నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
తప్పుడు కేసులకు భయపడొద్దని భరోసానిచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ పోరాడాలని పొన్నం అనిల్ గౌడ్‌కు ప్రత్యేకంగా సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, గొట్టం మహేష్, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.