by Suryaa Desk | Thu, Jan 09, 2025, 08:22 PM
ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ లో ఎస్‌బీఐ లైఫ్ & 191 ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి,మరియు కనుమ పండుగల సందర్బంగా 191 ఎన్టీఆర్ నగర్ శివాయలం గ్రౌండ్ ఎదురుగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బాచుపల్లి సీఐ ఉపేందర్ రావు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసీబీ డైరెక్టర్ మరియు ఆమనగల్లు కడ్తాల్ పీ.ఏ.సీ.ఎస్. చైర్మన్ గంప వెంకటేష్ గుప్త గార్లు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చక్కటి ముగ్గులు వేసిన మహిళలను అభినందిస్తూ పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ,మరియు తృతీయ విజేతలకు బహుమతులను అందచేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్‌బీఐ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, స్పాన్సర్స్ కాళ్ళకూరి కాశీ విశ్వనాథ్ (డివిజనల్ మేనేజర్ ఎస్‌బీఐ కేపీహెచ్ బీ బ్రాంచ్), కదిరే మధు(సీనియర్ టెర్రిటరీ మేనేజర్), దుగ్గి ప్రదీప్ (ఎస్‌బీఐ లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్) 191 ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శోభా రాణి, కాలనీ వాసులు రాజేష్, ఉపేందర్, మల్లేష్,నర్సింహా నాయక్,శేఖర్ మోహన్, , శేఖర్, జితేందర్, దత్తు,మహేందర్, జితేందర్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.