by Suryaa Desk | Fri, Jan 10, 2025, 12:38 PM
జీహెచ్‌ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మణికొండలోని నెక్నాంపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపటడ్డంతో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా బృందం శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ తెలిపారు.హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్‌ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది.