by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:10 PM
ఇద్దరు దొంగలు కలిసి వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ మోటార్ ను దొంగలించి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన కడుదుల సంజీవులు అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ మోటర్ ను ఈనెల ఆరో తారీకు నాడు గుర్తు తెలియని దొంగలు దొంగదించారని ఫిర్యాదు చే చేశారని తెలిపారు. దాని విలువ 40000 ఉంటుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా గురువారం.
ఉదయం10.15 సమయములో జయశంకర్ విగ్రహం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ పై దొంగలించిన కవి విద్యుత్ మోటార్ను తరలిస్తున్న యువకులు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారని సీఐ తెలిపారు. విచారించగా వారు అక్కంపేట గ్రామానికి చెందిన పెళ్లి రాజు, అమ్మి రజినీకాంత్ ఇద్దరు జులాయిగా తిరిగే యువకులన్నారు. ఖర్చులకోసం దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి విద్యుత్ మోటార్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు. దొంగతనాలు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఐ సంతోష్ కుమార్ హెచ్చరించారు