by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:25 PM
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ... లైసెన్స్ లేకుండా మైనర్స్ వాహనాలు నడపరాదు అని అది చట్టప్రకారం నేరం అని సూచించారు.
మీ తల్లితండ్రులు, మీ కుటుంబం లో, బంధువులు, పెద్దవారు వాహనాలు నడిపేటప్పుడు సీటుబెల్టు, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అదేవిధంగా మద్యం తాగి, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని మీరు వారికి చెప్పాలని వారికి అవగాహనా కల్పించాలని సూచించారు. విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రూల్స్ పై రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జహీద్, కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.