by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:31 PM
భీమారం మండలం గోవిందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి కెలావత్ రాము సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ ను, తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయుల తో మాట్లాడి పాఠశాల యొక్క స్థితిగతులను తెలుసుకున్నారు.
పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలకు సమయం లేదని సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికను రూపొందించుకొని ప్రణాళిక ప్రకారం శ్రద్ధతో చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ చిప్ప సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు అప్సక్ హుస్సేన్, ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.