by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:22 PM
మల్యాల మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో గల మండల ప్రాధమిక పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులకు పండగల విశిష్టత సాంప్రదాయాలు సంస్కృతిల విషయాలు.
అర్థమయ్యేలా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల సమక్షంలో భోగిమంటలు,హరి దాసులు,రంగవల్లులు, కోలాటాలు,సోది చెప్పడం,విద్యార్థులు గాలిపటాలు ఎగరవేయడం లాంటి కార్యక్రమాలతో పండగ వాతావరణం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు విట్టల్,సుహాసిని,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.