by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:24 PM
మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం హరిత రిసార్ట్‌కు వచ్చిన ప్రేమజంట ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం రూమ్ క్లినింగ్‌కి సిబ్బంది వెళ్ళగా ప్రేమికులు ఉరివేసుకుని కనిపించారు. హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో మునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు ఉదయ్, మౌనికగా గుర్తించారు.