by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:24 PM
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో గుంపుల గ్రామంలో వాహనాల తనిఖీ నిర్వహించినారు, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని, వాహనాల పై కేసులు నమోదు చేస్తామని రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు.
వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాల కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయని తెలిపారు,ఎస్సై దీకొండ రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.