by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:21 PM
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రాజకీయ నాయకులు, గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో ప్రధాన కూడళ్లలో గ్రామ ప్రవేశ మార్గం, ముగింపు ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలను గ్రామ పెద్దలను అభినందించారు.
సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు మరింత భద్రత, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పిస్తాయని తెలిపారు. సీసీ కెమెరాలు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు. సీసీ కెమెరాలు ఉండి పని చెయ్యని గ్రామాలలో, సిసి కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.