by Suryaa Desk | Tue, Jan 07, 2025, 05:08 PM
ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర బిఆర్ఎస్ పిలుపుమేరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిరసన తెలిపారు 15వేల రైతు భరోసా ఇవ్వాలని అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సురేందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం.
420 హామీ ఇచ్చి వాటి నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని గత ఏడాది పంట రైతు భరోసా అంది ఇవ్వలేదని వాన కాలం పంట కు 15వేల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి. మాజీ జెడ్పి కోఆప్షన్ సర్వర్ భాష. సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్. సీనియర్ నాయకులు సతీష్ చందర్. యాదగిరి. రావు. నాయకులు మనోహర్ శ్రీనివాస్ స్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.