by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:30 PM
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములో గోదాదేవికి సారి ఒడిబియ్యం మహోత్సవ వేడుకలు వేద పండితులు ఆరుట్ల మాధవ్ మూర్తి దంపతులు వేదమంత్రోచరణలతో నిర్వహించారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని దేవాలయములో వేద పండితులు ఆరుట్ల మాధవమూర్తి వేదమంత్రోచాలతో ఉదయం పంచ అమృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తిరుప్పావలి, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ వెంకటేశ్వర భజన మండలి బృందం ఆలపించిన భక్తి పాటలకు భక్తులు మహిళలు మైమరిచి భక్తి పారవశ్యంతో నృత్యాలు చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ పలకల మంజుల ఇంటి దగ్గర నుండి ఓడి బియ్యం, సారే, ఫలహారాలు, కుడుకలు పోకలు, పూలమాలలు, కొబ్బరికాయలు మహిళలందరూ కలిసి ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపుగా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం కు చేరుకున్నారు. వేద పండితులు ఆరుట్ల మాధవమూర్తి దంపతులు గోదాదేవి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన రకరకాల పుష్పాలతో అలంకరించారు.
డప్పు సప్పులు, వేదమంత్రాలతో అమ్మవారిని ఆరు బయటకు తీసుకువచ్చి సారీ ఒడి బియ్యం ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు ఉదయం ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి నుండి ఒడిబియ్యం మంగళ హారతులు, పండ్లు పువ్వులు కొబ్బరికాయలు, తీసుకొని వచ్చిన వాటిని అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆరుట్ల మాధవమూర్తి మాట్లాడుతూ గోదా దేవి అమ్మవారు మన ఇంటి ఆడబిడ్డ రంగనాధునికి ఇచ్చి కళ్యాణం చేసే సమయంలో అమ్మవారు స్వామివారికి మొక్కులు చెల్లిస్తానని మొక్కుకున్నారు.